గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు - నిందితుల రిమాండ్ పొడిగింపు - Remand extended TDP Office Attack - REMAND EXTENDED TDP OFFICE ATTACK
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 7, 2024, 4:22 PM IST
Court Extended Remand on TDP Office Attack Accused Persons : కృష్ణా జిల్లా గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దాడి కేసులో ముద్దాయిలకు న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. దాడి కేసులో 18 మంది ముద్దాయిలను పోలీసులు స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఈ నెల 21వ తేదీ వరకు రిమాండ్ పొడగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. దీంతో ముద్దాయిలను నూజివీడు, గన్నవరం సబ్ జైలుకు పోలీసులు తరలించారు.
అయితే మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై 2021 అక్టోబర్ 19న వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. అలాగే టీడీపీ కార్యాలయ సిబ్బందిపై దాడి చేయడంతో పాటు కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ ధ్వంసం చేసి వీరంగం సృట్టించారు. కార్యాలయం వెలుపల ఉన్న కార్లని సైతం ధ్వంసం చేశారు. ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసిన తూతూ మంత్రంగా విచారణ చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కేసులో వేగం పుంజుకుంది. దీంతో వైఎస్సార్సీపీ నేతలు భయాందోళనలో పడ్డారు.