ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కార్పోరేటర్ భర్త కికాతకం - భూకబ్జా అడ్డుకున్నరని సీపీఐ నేతలపై దాడి - Attacks by YCP leaders

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 3, 2024, 9:37 PM IST

Corporator Husband Attacked CPI Leaders: రాష్ట్రంలో వైసీపీ నాయకులు, వారి అనుచరుల అరాచకాలకు హద్దే లేకుండా పోతోంది. ఖాళీ స్థలం కనిపిస్తే దానిని కబ్జా చేయడం, అడ్డుకున్న వారిపై అన్యాయంగా దాడులు చేయడం వంటి అరాచకాలు చేస్తున్నారు. తాజాగా స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నాన్ని అడ్డుకున్న వారిపై ఓ కార్పొరేటర్‌ భర్త దాడికి పాల్పడిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్సే నగరపాలక సంస్థ పరిధిలోని 26వ డివిజన్‌ కార్పోరేటర్‌ భర్త బ్రహ్మారెడ్డి స్థానిక చండ్రరాజేశ్వరరావు నగర్‌లో కోర్టు కేసులో ఉన్న స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో అక్కడకు స్థలాన్ని కబ్జా చేయకుండా ఆపేందుకు వెళ్లిన సీపీఐ నాయకులపై ఆయన దాడికి పాల్పడ్డారు. వారిపై మారణాయుదాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడిలో తీవ్రంగా గాయపడిన సీపీఐ నేతలు దేవానాయక్, వాసునాయక్​లను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని సీపీఐ నగర కార్యదర్శి మాల్యాద్రి పరామర్శించారు.

ABOUT THE AUTHOR

...view details