ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మరోసారి దిల్లీకి సీఎం జగన్‌ - పర్యటనకు కారణం అదేనా? - సీఎం జగన్ దిల్లీ పర్యటన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 2, 2024, 7:56 PM IST

CM YS Jagan Delhi Tour: ముఖ్యమంత్రి జగన్‌ మరోసారి దిల్లీ వెళ్లనున్నట్టు తెలిసింది. ఆదివారం లేదా సోమవారం దిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో జగన్ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇరువురి అపాయింట్​మెంట్ ఖరారు కాగానే సీఎం విజయవాడ నుంచి దిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. దిల్లీ పర్యటన కోసమే 4వ తేదీన కర్నూలు పర్యటనను సైతం సీఎం జగన్ వాయిదా వేసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం దిల్లీలో ప్రధాని, హోంమంత్రి అపాయింట్​మెంట్లు ఖరారు కాకపోవటంతో జగన్ షెడ్యూలు ఇంకా నిర్ణయం కాలేదు. 

ఈ నెల 5 తేదీన తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రధాని మోదీ, అమిత్ షాలతో భేటీ అవుతారన్న సమాచారంతోనే సీఎం జగన్ హడావుడిగా దిల్లీ పర్యటన పెట్టుకున్నట్టు తెలుస్తోంది. గత నెలలోనూ చంద్రబాబు దిల్లీలో మోదీని కలుస్తున్నారన్న సమాచారం తెలిసిన వెంటనే సీఎం హడావిడిగా దిల్లీ వెళ్లి ప్రధాని, హోం మంత్రితో మంతనాలు జరిపి వెనక్కి వచ్చారు. ఈ దఫా కూడా అదే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. దిల్లీ నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఈ నెల 5వ తేదీన జగన్ విశాఖలో పర్యటించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details