ప్రాజెక్టులు, నీటి కేటాయింపులపై అసెంబ్లీలో చర్చకు మేం సిద్ధం - కేసీఆర్ సిద్ధమా?: సీఎం రేవంత్ రెడ్డి - Revanth Reddy on Irrigation
Published : Feb 4, 2024, 6:52 PM IST
|Updated : Feb 4, 2024, 7:11 PM IST
CM Revanth Reddy on BRS Government Mistakes : నాటి సీఎం కేసీఆర్, అప్పటి అమాత్యులు కేటీఆర్, హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణకు 299 టీఎంసీల కృష్ణాజలాల కేటాయింపుపై అప్పటి సీఎం కేసీఆర్, అధికారులు అంగీకరించి సంతకాలు చేశారని గుర్తుచేశారు. కేసీఆర్, హరీశ్‌రావు నీటి పారుదల శాఖ మంత్రులుగా ఉన్నప్పుడే ప్రాజెక్టులను కేంద్రానికి ధారాదత్తం చేశారని ఆక్షేపించారు.
Revanth Reddy Fire on KCR : గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజున నాగార్జున సాగర్ డ్యామ్‌ను ఏపీ సీఎం జగన్ ఆక్రమిస్తుంటే, కేసీఆర్ ఎందుకు స్పందించలేదని రేవంత్ రెడ్డి(Revanth Reddy) నిలదీశారు. రాయలసీమ ఎత్తిపోతలను జగన్ సర్కార్ నిర్మిస్తుంటే కినుక వహించింది కేసీఆర్ కాదా అని రేవంత్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు అడ్డుకోకుండా కేసీఆర్ పదేళ్లు ఏం చేశారని నిలదీశారు. ప్రాజెక్టులు, నీటి కేటాయింపులపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించడానికి రావాలంటూ కేసీఆర్‌కు సవాల్ విసిరారు. అవసరమైతే ఉమ్మడి సమావేశాలు నిర్వహిస్తామన్న ముఖ్యమంత్రి ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేస్తామని స్పష్టం చేశారు.