ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన - ప్రత్యక్ష ప్రసారం - Chandrababu visit to Kuppam - CHANDRABABU VISIT TO KUPPAM

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 25, 2024, 1:47 PM IST

Updated : Jun 25, 2024, 2:51 PM IST

LIVE : నాలుగోసారి సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటిస్తున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు సొంత నియోజకవర్గంకుప్పంలో పర్యటించనున్నారు. ఉదయం అమరావతి నుంచి కుప్పానికి వచ్చారు. మధ్యాహ్నం శాంతిపురం మండలం జల్లిగానిపల్లిలో చిన్నారిదొడ్డి హంద్రీ-నీవా కాలువను పరిశీలించనున్నారు. కాలువను పరిశీలించడంతో పాటు కడప ఆర్టీసీ బస్టాండు సమీపంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం ఆర్ అండ్‌ బీ అతిథి గృహంలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. బుధవారం ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. మధ్యాహ్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కుప్పం నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. పీఈసీ కళాశాలలో పార్టీ నేతలతో సమావేశం అనంతరం తిరిగి అమరావతి చేరుకుంటారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి కుప్పం పర్యటనకు ఏర్పాట్లను పూర్తి చేశారు. మంగళ, బుధ వారాల్లో శాంతిపురం, కుప్పం మున్సిపాలిటీ పరిధిలో సీఎం పర్యటనకు సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. భారీ ఎత్తున స్వాగత సన్నాహాలు చేపట్టారు.
Last Updated : Jun 25, 2024, 2:51 PM IST

ABOUT THE AUTHOR

...view details