LIVE : CII నేషనల్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు- ప్రత్యక్ష ప్రసారం - CBN LIVE - CBN LIVE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 11, 2024, 4:53 PM IST
CM Nara Chandrababu Naidu LIVE : స్కిల్ సెన్సెస్‌పై ప్రధానంగా దృష్టి సారించామని సీఎం చంద్రబాబు తెలిపారు. గ్లోబల్‌గా ఉద్యోగ అవకాశాలు పొందేలా చూస్తామని అన్నారు. సీఐఐ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగాలు అందిపుచ్చుకునేందుకే స్కిల్ గణన అని స్పష్టం చేశారు. తయారీ రంగానికి ఏపీ వ్యూహాత్మక ప్రాంతమని చెప్పిన చంద్రబాబు ఏపీలో సుదీర్ఘ కోస్తా ప్రాంతం, మౌలిక సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. ఫార్మా, ఆటోమొబైల్, హార్డ్‌వేర్, అగ్రో ఇండస్ట్రీస్ రంగాల్లో ఏపీలో ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. విశాఖను ఫిన్‌టెక్ హబ్‌గా తీర్చిదిద్దుతామని, మచిలీపట్నంలో రిఫైనరీ కూడా రాబోతోందని చెప్పారు. కొత్త ఐడియాలు, టెక్నాలజీలను ప్రోత్సహించడంలో తాను ముందు ఉంటానన్న చంద్రబాబు ఎలాంటి ఐడియాతో వచ్చినా ప్రోత్సహిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో అద్భుత అవకాశాలు ఉన్నాయి, ఫిన్‌టెక్, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయని వివరించారు. CII నేషనల్ కౌన్సిల్ సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.