ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సిద్ధం సభలో టీడీపీ- జనసేన-బీజేపీ పొత్తుపై సీఎం జగన్ విమర్శలు - Jagan on TDP BJP Janasena Alliance

🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 10, 2024, 10:38 PM IST

CM Jagan on TDP BJP Janasena Alliance : తెలుగుదేశం - జనసేన- బీజేపీ పొత్తుపై ముఖ్యమంత్రి జగన్ విమర్శనాస్త్రాలు సంధించారు. వైఎస్సార్సీపీతో నేరుగా తలపడే ధైర్యం లేకనే అరడజను పార్టీలతో చంద్రబాబు పొత్తులు పెట్టుకుని అన్నారు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో జరిగిన సిద్ధం సభలో ప్రతిపక్షాలే లక్ష్యంగా సీఎం నిప్పులు చెరిగారు. 

Police Notices to Media Personnel : మరో వైపు మేదరమెట్లలో వైసీపీ నిర్వహించిన 'సిద్ధం' సభ కవరేజీకి వెళ్లొద్దంటూ పలువురు మీడియా సిబ్బందికి బాపట్ల జిల్లా ఎస్పీ కార్యాలయం నుంచి నోటీసులు జారీ అయ్యాయి. నోటీసులు తీసుకోవాలంటూ మీడియా ప్రతినిధులకు స్థానిక పోలీసులు ఫోన్లు చేశారు. ఎస్పీ కార్యాలయం నుంచి 149 నోటీసులు వచ్చాయని వారు చెప్పారు. సభ కవరేజీకి వెళ్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కవరేజీకి వెళ్లొద్దంటూ నోటీసులు ఇవ్వడంపై మీడియా ప్రతినిధులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

మీడియా సిబ్బందితో పాటు యూటీఎఫ్‌ నేతలు, టీడీపీ నేతలు, కార్యకర్తలకు నోటీసులు జారీ చేశారు. సభను అడ్డుకుంటారంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అదే విధంగా కొరిశపాడు మండలం తూర్పుపాలెం రైతులకు సైతం నోటీసులు ఇచ్చారు. సిద్ధం సభ వైపు వెళ్లొద్దంటూ నలుగురు రైతులకు పోలీసుల నోటీసులను జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details