ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాల స్వరూపాన్ని మార్చాం: జగన్‌ - CM Jagan Memu Siddam Bus Yatra - CM JAGAN MEMU SIDDAM BUS YATRA

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 28, 2024, 10:29 PM IST

CM Jagan criticized opposition: గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వ్యవస్థలను పూర్తిగా మార్చామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. 'మేమంతా సిద్ధం బస్సుయాత్ర'లో భాగంగా సీఎం జగన్ ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాల స్వరూపమే మార్చామని జగన్‌ తెలిపారు. ప్రత్యేక హోదా విభజన హామీలు నెరవేర్చకుండానే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు మరోసారి జట్టు కడుతున్నారని సీఎం జగన్‌ అన్నారు.  విద్యావ్యవస్థలో అనేక మార్పులు తీసుకువచ్చామని తెలిపారు. పేదవాడికి ఉచిత వైద్యసేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అక్క, చెల్లమ్మలకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తున్నామని తెలిపారు.  గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి, ప్రజల కోసం ఏంచేశాడో ఆలోచించాలని పిలుపునిచ్చారు. ఈ సారి ఓటు వేసే ముందు భవిష్యత్​ గురించి  ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఇంట్లో అంతా కలిసి మాట్లాడిన తరువాత, ఓటు వేసే అంశంపై  నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details