ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వైసీపీ ఎన్నికల ప్రచారం - మార్చి 27 నుంచి జగన్​ బస్సు యాత్ర - CM Jagan Bus Yatra From 27 March

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 19, 2024, 8:17 PM IST

CM Jagan Bus Yatra From 27th March : ఈ నెల 27 (మార్చి) నుంచి వైసీపీ అధ్యక్షుడి హోదాలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బస్సుయాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. ఈ యాత్ర ఇడుపులపాయ నుంచి ఉత్తరాంధ్ర వరకు కొనసాగనుంది. మెుదట 27వ తేదీన ఉదయం ఇడుపులపాయలో వైఎస్​ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి అనంతరం బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. సిద్దం బహిరంగ సభలు జరిగిన ప్రాంతాలు మినహా మిగిలిన చోట ఈ యాత్ర నిర్వహించనున్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల సభలు నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది. 

మెుదటి రోజు బస్సుయాత్ర ద్వారా మధ్యాహ్నం 3 గంటలకు ప్రొద్దుటూరు చేరుకుని అక్కడ తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రతి రోజూ ఉదయం 9.30 గంటలకు వివిధ వర్గాల ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహిస్తారు. సాయంత్రం 3 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ నెల 28న నంద్యాలలో సీఎం వైఎస్ జగన్ ఎన్నికల బహిరంగ సభ నిర్వహిస్తారు. గుడ్ ఫ్రైడే కారణంగా ఈనెల 29న బహిరంగ సభ ఉండదు. అలాగే 30వ తేదీన ఎమ్మిగనూరులో సీఎం వైఎస్ జగన్ ఎన్నికల బహిరంగ సభ నిర్వహిస్తారు. 

ABOUT THE AUTHOR

...view details