ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో చంద్రబాబు సరికొత్త రికార్డు - తాజా ప్రకటనతో 2,32,179కు చేరిన సంఖ్య - Chandrababu Filling Teacher Posts - CHANDRABABU FILLING TEACHER POSTS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 14, 2024, 4:59 PM IST
CM Chandrababu New Record in Filling Teacher Posts: ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సరికొత్త రికార్డు సృష్టించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నవ్యాంధ్ర సీఎంగానూ కలిపి ఆయన మొత్తం 9 డీఎస్సీలు ప్రకటించి 2 లక్షల మందికిపైగా ఉపాధ్యాయుల్ని నియమించారు. 1996లో తొలిసారి డీఎస్సీ ప్రకటించిన చంద్రబాబు అప్పుడు 50 వేలకు పైగా పోస్టులను భర్తీ చేశారు. 1998లో డీఎస్సీ ద్వారా 39,104 పోస్టులు, 2000 సంవత్సరంలో 25,746 పోస్టుల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించారు.
2001లో 32,129 ఖాళీలు భర్తీ చేశారు. 2002 DSC ద్వారా 35,805 పోస్టులు, 2003లో 16,258 పోస్టులు భర్తీ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా 2014లో 9,061 ఉపాధ్యాయ ఖాళీలను చంద్రబాబు భర్తీ చేశారు. 2019లో 7,729 ఖాళీలు భర్తీ చేశారు. నవ్యాంధ్రలో రెండవసారి అధికార బాధ్యతలు తీసుకున్నాక మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసారి 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. మొత్తంగా తాజా ప్రకటనతో కలిపి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఇప్పటివరకు 2,32,179 ఉపాధ్యాయ పోస్టులను ప్రకటించారు.