ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: శ్రీ సత్యసాయి జిల్లాలో పింఛన్లు పంపిణీ చేస్తున్న సీఎం చంద్రబాబు - ప్రత్యక్ష ప్రసారం - Chandrababu distributing pensions

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 1, 2024, 3:58 PM IST

Updated : Aug 1, 2024, 5:33 PM IST

NTR Bharosa Pensions Distribution By CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం సాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 6 గంటలకు పెన్షన్ల పంపిణీ ప్రారంభించగా 9 గంటలు అయ్యేసరికి 71 శాతం పంపిణీ పూర్తయింది. కేవలం 3 గంటల వ్యవధిలోనే సగానికి పైగా పంపిణీ పూర్తవటంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పింఛన్ల పంపిణీని వాలంటీర్ల కంటే స్పీడుగా సచివాలయ సిబ్బందే చేస్తున్నారని అంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కూటమి ప్రభుత్వం పింఛన్ల పంపిణీ చేయటంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు పింఛన్ల వివరాలను అధికారిక వెబ్​సైట్​లో పెడుతోంది. ఇళ్ల వద్దే సచివాలయ సిబ్బంది పింఛన్‌ మొత్తం అందించేలా ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం  శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. పింఛన్లను చంద్రబాబు లబ్దిదారుల ఇంటి వద్దకే వెళ్లి ఇస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం. 
Last Updated : Aug 1, 2024, 5:33 PM IST

ABOUT THE AUTHOR

...view details