ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అన్​స్టాపబుల్​ బాలకృష్ణ​ - రికార్డులు, రివార్డులు ఆయన సొంతం - అందుకే ముగ్గురు ముఖ్యమంత్రుల ఆగమనం - CM CBN Congratulated Balakrishna - CM CBN CONGRATULATED BALAKRISHNA

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 30, 2024, 3:48 PM IST

Updated : Aug 30, 2024, 4:32 PM IST

CM Chandrababu Congratulated Balakrishna: ఆంధ్రుల అభిమాన కథానాయకుడు నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తన యాభై ఏళ్ల నట ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. 50 ఏళ్ల క్రితం ఇదే రోజున విడుదలైన ‘తాతమ్మ కల’ చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన బాలయ్య ఇప్పటికీ అగ్రహీరోగా రాణిస్తున్నారని కొనియాడారు. యాబై ఏళ్లు అయినా ఇప్పటికీ నేటి తరాన్ని కూడా అలరించే చిత్రాలతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతున్నారని సీఎం ప్రశంసించారు. తండ్రి ఎన్టీఆర్ పోషించిన పౌరాణిక పాత్రలతో పాటు అన్ని జానర్లలో నటించిన బాలకృష్ణ తానేంటో చాటి చెప్పారని కొనియాడారు. కథానాయకుడిగానే కాకుండా ప్రజా నాయకుడిగా కూడా రాణిస్తున్న బాలకృష్ణ మరిన్ని రికార్డులు సృష్టించి, మరెన్నో మైలురాళ్లను అధిగమించి అన్​స్టాపబుల్​గా ముందుకు సాగాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బాలకృష్ణ అభిమానులు బాణసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు.

Last Updated : Aug 30, 2024, 4:32 PM IST

ABOUT THE AUTHOR

...view details