LIVE: మచిలీపట్నంలో గాంధీ జయంతి వేడుకలు - హాజరైన సీఎం చంద్రబాబు - ప్రత్యక్ష ప్రసారం - CM Chandrababu Live
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 2, 2024, 11:21 AM IST
|Updated : Oct 2, 2024, 1:27 PM IST
LIVE : గాంధీ బాటలో అందరూ నడవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రముఖులు అభిప్రాయపడ్డారు. మహాత్మా గాంధీ జయంతి వేళ ఘన నివాళులు అర్పించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు మచిలీపట్నంలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకలకు హాజరయ్యారు. జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినం సందర్భంగా చంద్రబాబునివాళులర్పించారు. ఆ మహనీయులు దేశానికి చేసిన సేవలను కొనియాడారు. మానవుడిని మహాత్మునిగా చేసే సద్గుణాలను తన జీవితం ద్వారా ప్రపంచానికి అందించిన ఉన్నతుడు గాంధీజీ అని చంద్రబాబు అన్నారు. నైతికతే బలంగా ప్రతి సమస్యపై పోరాడి గెలిచిన సత్యాగ్రహి అని పేర్కొన్నారు. గాంధీ జీ జయంతి సందర్భంగా ఆ మహానుభావుడు ఆశించిన అహింసాయుత, శాంతి సమాజం కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. సత్యం, అహింసకు మించిన ఆయుధాలు లేవంటూ ప్రపంచ శాంతికి బాపూజీ మార్గ నిర్దేశం చేశారని తెలిపారు. భారత జాతీయోద్యమంలో స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దేశం కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఘన నివాళులర్పిస్తున్నట్లు చెప్పారు. మచిలీపట్నంలో గాంధీ జయంతి వేడుకలు - హాజరైన సీఎం చంద్రబాబు - ప్రత్యక్ష ప్రసారం
Last Updated : Oct 2, 2024, 1:27 PM IST