'ఎమ్మెల్యే బెదిరిస్తున్నారు' - కొలికపూడి శ్రీనివాస్‌పై సీఎంకి మీడియా ప్రతినిధుల ఫిర్యాదు - Complaint on TDP MLA Kolikapudi - COMPLAINT ON TDP MLA KOLIKAPUDI
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 28, 2024, 5:51 PM IST
CM Chandrababu About Complaint on TDP MLA Kolikapudi: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారంపై రోజురోజుకూ ఫిర్యాదులు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబుకు మీడియా ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే మీడియా ప్రతినిధులందరినీ కించపరిచేలా మాట్లాడటమే కాకుండా బెదిరిస్తున్నారని తెలిపారు. కొలికపూడిపై ఫిర్యాదు చేసేందుకు తిరువూరు స్థానిక మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో వచ్చారు. టీడీపీ కార్యాలయంలో సీఎంను కలిసి ఫిర్యాదు చేశారు. కొలికపూడి తమను బెదిరిస్తూ కించపరిచిన ఆధారాలను మీడియా ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని కోరారు. తనకు అన్ని విషయాలు తెలుసన్న చంద్రబాబు, వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ఇప్పటికే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వేధిస్తున్నారంటూ చిట్టేల సర్పంచి తుమ్మలపల్లి శ్రీనివాసరావు సైతం తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా మరొకరిని నియమించాలని కోరారు. తాజాగా మీడియా ప్రతినిధులు సైతం ఫిర్యాదు చేయడంతో, సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.