LIVE: పాణ్యంలో చంద్రబాబు పర్యటన - ప్రత్యక్ష ప్రసారం - Chandrababu Prajagalam Panyam - CHANDRABABU PRAJAGALAM PANYAM
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 6, 2024, 11:55 AM IST
|Updated : May 6, 2024, 12:54 PM IST
Chandrababu Prajagalam Live From Panyam : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాణ్యం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. పాణ్యం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనలో మాట్లాడుతూ వైసీపీపై నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రభుత్వం అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిందని దుయ్యబట్టారు. రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో జగన్ అక్రమాలపై చర్యలు చేపడతామన్నారు. జగన్కు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. స్వంత కుటుంబానికి న్యాయం చేయని సీఎం రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీ, జనసేన ప్రకటించిన ఉమ్మడి మ్యని ఫెస్టోకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం మెగా డీఎస్సీపై ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఉంటుందని పేర్కొన్నారు. వైసీపీ నేతలు ప్రజల భూములను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలతో ప్రజల జీవితాలు నాశనం చేశారని మండిపడ్డారు. తాను అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యం సరఫరా అయ్యేట్లు చూస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. చెన్నమ్మ సర్కిల్ బహిరంగ సభలో చంద్రబాబు ప్రత్యక్ష ప్రసారం మీకోసం.
Last Updated : May 6, 2024, 12:54 PM IST