చంద్రబాబు జీవితం ఒక తెరిచిన పుస్తకం - మచ్చలేని మహానీయుడు: టీడీపీ నేతలు - CBN First Oath Complete 30 Years - CBN FIRST OATH COMPLETE 30 YEARS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 31, 2024, 10:28 PM IST
Chandrababu Oath as CM For First Time Complete 30 Years : చంద్రబాబు మొదటిసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి రేపటికి (ఆదివారం) 30 వసంతాలు పూర్తవుతున్నందున ఆయన సేవలను కొనియాడుతూ టీడీపీ నేతలు రాష్ట్రంలో సంబరాలకు సిద్ధమయ్యారు. 1995 సెప్టెంబర్ 1న మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారని నేతలు అన్నారు. టీడీపీ కేంద్ర, జిల్లా కార్యాలయాల్లో చంద్రబాబు ఫొటో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయనున్నారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు, నవ్యాంధ్ర నిర్మాణ ప్రధాత అని నేతలు కొనియాడారు.
చంద్రబాబు ఆలోచనా విధానానికి ఎవరూ సాటి రాలేరని నేతలు ప్రశంసించారు. చంద్రబాబుతోనే ఏపీ పునర్నిర్మాణం సాధ్యమని నేతలు పేర్కొన్నారు. చంద్రబాబు విధానాలను ఇతర రాష్టాలు కూడా అనుసరిస్తున్నాయని నేతలు వివరించారు. రాజకీయ చరిత్రలో ఒక ఐకాన్‌గా చంద్రబాబు పేరు నిలుస్తుందని వెల్లడించారు. చంద్రబాబు జీవితం ఒక తెరిచిన పుస్తకం, మచ్చలేని మహానీయుడని నేతలు ప్రశంసించారు. సమాజ అభివృద్ధే తన లక్ష్యంగా జీవనం కొనసాగిస్తున్నారన్నారు. రాజకీయాల్లో అపర చాణక్యుడు, అభివృద్ధిలో తిరుగులేని నేతగా గొప్ప వ్యక్తుల నుంచి ప్రసంశలు పొందారని గుర్తు చేశారు.