రాష్ట్రాన్ని ఏవిధంగా అభివృద్ధి చేస్తారో చెప్పి ప్రజలను ఓట్లు అడగండి : నిమ్మగడ్డ - Citizens for Democracy meeting - CITIZENS FOR DEMOCRACY MEETING
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 6, 2024, 3:32 PM IST
CFD Instructions to Political Parties : ఎన్నికల తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేస్తారో చెప్పి ఓట్లు అభ్యర్థించాలని సిటీజన్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని రాజకీయ పార్టీలకు సూచించారు. సీఎఫ్డీ ఆధ్వర్యంలో 'అభివృద్ధితో సంక్షేమం సుపరిపాలనకు సవాళ్లు' అనే అంశంపై నిర్వహించిన చర్చా గోష్టిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని పోటీతత్వంతో ముందుకు తీసుకెళ్తామన్న నినాదంతో రాజకీయపార్టీలు ప్రజలముందుకు వెళ్లాలన్నారు. ప్రస్తుతం ఎన్నికల వేళ రాష్ట్రాన్ని రాజకీయ పార్టీలు ఏవిధంగా అభివృద్ధి చేస్తారో ప్రజలకు క్లూప్తంగా చెప్పలని సూచించారు.
రాష్ట్రంలో విద్య, వైద్యం, పెట్టుబడులు తీసుకువచ్చి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు చూపించాలని కోరారు. అధికారంలోకి వస్తే ఉన్న ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా సుపరిపాలన అందిస్తారో ప్రజలకు చెప్పాలన్నారు. అలాంటి పార్టీలనే ప్రజలు ఆశీర్వదిస్తారు. ప్రజలు ఇలాంటి హామీలనే రాజకీయ పార్టీల నుంచి ఆశిస్తున్నారని తెలిపారు. అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పార్టీనే ప్రజలంతా ఎన్నుకోవాలని సీఎఫ్డీ ఉపాధ్యక్షుడు ఎల్వీ సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు.