దళితులపై వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దాడులు, దౌర్జన్యాలను ఆపాలి : బీఎస్పీ నేత రాంజీ గౌతమ్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 3, 2024, 5:56 PM IST
BSP Meeting in Annamayya District : బహుజనులు రాజ్యాధికారం సాధించుకోవాలంటే ఐక్యతగా మెలగాలని బహుజన సమాజ్ పార్టీ(BSP) రాష్ట్ర ఇన్‌ఛార్జి రాంజీ గౌతమ్ అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయాలతో బహుజనలకు తీరని అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. శనివారం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బీఎస్పీ ఆధ్వర్యంలో బహుజన రాజ్యాధికార సదస్సు నిర్వహించారు. ముందుగా మదనపల్లె బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు ముఖ్య అతిథిలుగా ఉన్న రాంజీ గౌతమ్, పరంజ్యోతిలను సభ వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు.
AP BSP Chief : అనంతరం జరిగిన సదస్సులో రాంజీ గౌతమ్ మాట్లాడుతూ, బహుజనులు రాజ్యాధికారం సాధించుకోవాలంటే ఐక్యతగా మెలగాలని తెలిపారు. రాష్ట్రంలో దళితులపై వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దాడులు, దౌర్జన్యలు ఆపాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ అధికారంలోకి వస్తే భూమి లేని నిరుపేదలకు భూ పంపిణీ చేస్తామని చేప్పారు. అలాగే విద్య, వైద్యన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వ అధీనంలోకి తీసుకొని అన్ని వర్గాలకు సేవలందిస్తామని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు.