ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: తెలంగాణ బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత విడుదల - ప్రత్యక్ష ప్రసారం - MLC Kavitha Release from Tihar Jail - MLC KAVITHA RELEASE FROM TIHAR JAIL

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 27, 2024, 9:03 PM IST

Updated : Aug 27, 2024, 9:24 PM IST

BRS MLC Kavitha Release from Delhi Tihar Jail : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్​ను మంజూరు చేసింది. ఈ క్రమంలో ఆమె తిహాడ్​ జైలు నుంచి విడుదలయ్యారు. ఒక్కో కేసులో రూ.10 లక్షల పూచీకత్తు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించగా, వారు పూచీకత్తును కోర్టుకు సమర్పించారు. అలాగే సాక్షులను ప్రభావితం చేయరాదని తెలిపారు. పాస్​పోర్టు డిపాజిట్​ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వీటన్నింటికీ ఒప్పుకున్న పిటిషనర్​ కవిత అన్ని నిబంధనలను పూర్తిగా కంప్లీట్​ చేసి జైలు నుంచి విడులయ్యారు. ఈ ఏడాది మార్చి 15న ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. కవిత 5 నెలలకు పైగా తీహాడ్​ జైలులోనే ఉన్నారు. ఆమె బెయిల్​ పిటిషన్​పై విచారించిన జస్టిస్​ బీఆర్​ గవాయి, జస్టిస్​ విశ్వనాథన్​తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈడీ, సీబీఐ కేసులో బెయిల్​ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్సీ కవితకు బెయిల్​ రావడంతో బీఆర్​ఎస్​ శ్రేణలు ఆనందంలో మునిగిపోయారు. టపాయలు పేల్చుతూ సంబురాలు చేసుకున్నారు.
Last Updated : Aug 27, 2024, 9:24 PM IST

ABOUT THE AUTHOR

...view details