ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE : ఈడీ అదుపులో ఎమ్మెల్సీ కవిత - ప్రత్యక్షప్రసారం - live from kavitha house

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 15, 2024, 6:19 PM IST

Updated : Mar 15, 2024, 7:16 PM IST

BRS Live : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ, ఐటీ అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహించి ఆమెను అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ జాయింట్‌ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో 10 మంది అధికారుల బృందం, ఐటీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆమె ఇంట్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కవిత నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్రం తీరుపై గులాబీ నేతలు భగ్గుమన్నారు. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఈడీ, ఐటీ అధికారులను బీజేపీ నేతలు పంపారని బీఆర్​ఎస్ నేతలు ఆరోపించారు. ఇలాంటి చర్యలకు తమ నేత భయపడేది లేదని తేల్చిచెప్పారు. తాము ఈడీలకు, ఐటీకి భయపడేది లేదని.. ప్రజల మద్దతు తమకే ఉందన్నారు. కేంద్రం ఈడీ, ఐటీని తమ పార్టీ కార్యకర్తలుగా మార్చాలని మండిపడ్డారు. ఎన్నికల వేళ కావాలనే తమపై దాడులు చేస్తున్నారని ఆక్షేపించారు.
Last Updated : Mar 15, 2024, 7:16 PM IST

ABOUT THE AUTHOR

...view details