ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తిరుమలలో బీఆర్​ఎస్​ మాజీ మంత్రి హరీష్​ రావు, భారత్ బయోటెక్ ఎండీ ఎల్లా కృష్ణ దంపతులు - VIPS VISIT TIRUMALA - VIPS VISIT TIRUMALA

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 28, 2024, 1:48 PM IST

BRS Ex Minister Harish Rao AT Tirumala : తిరుమల శ్రీవారిని తెలంగాణ బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao), భారత్ బయోటెక్ ఎండీ ఎల్లా కృష్ణ దంపతులు దర్శించుకున్నారు. వీఐపీ (VIP) ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు (Tirumala Tirupati Devasthanam) వారికి సాదరంగా స్వాగతం పలికారు. వారి కోసం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Bharat Biotech Krishna and Suchitra Ella Visit Tirumala : దర్శనం అనంతరం వారికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తెలంగాణ మాజీ మంత్రిని (Minister) చూసి పలువురు భక్తులు సెల్ఫీలు తీసుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయం (Temple) ప్రాంగణం కిటకిటలాడింది. స్వామి వారి సేవలో భక్తులు బారులు తీరారు. ప్రముఖుల రాకతో దేవాలయ ప్రాంగణంలో కోలాహల వాతావరణం నెలకొంది. 

ABOUT THE AUTHOR

...view details