ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

గుంతల రోడ్డుకు నవవధువు బలి - road accident visakha

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 20, 2024, 5:04 PM IST

Bride Fell into a Pothole and Died : రహదారి గుంతలో పడి నవవధువు మృత్యువాత పడిన హృదయ విదారక ఘటన విశాఖ జిల్లా చీమలాపల్లిలో జరిగింది. వెంకటాపురానికి చెందిన పెంటకోట వెంకట అప్పారావు, గుల్లేపల్లికి చెందిన సంతోషి ఇటీవలే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దంపతులిద్దరూ గురువారం సాయంత్రం ద్వి చక్ర వాహనంపై గుల్లేపల్లి వెళ్లి తిరిగి వస్తుండగా గుంతలోకి వాహనం దిగి అదుపు తప్పింది.

Officers Responded to the Death of the Victim : ద్వి చక్ర వాహనం అదుపు తప్పడం వల్ల సంతోషి కింద పడిపోయింది. ఈ ఘటనలోనే సంతోషి తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే స్థానికులు సహకారంతో సంతోషిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సంతోషి మరణించింది. బాధితురాలి మరణ వార్త విని కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. అధికారులు స్పందించి గుంతని పూడ్చారు. ప్రజలు చనిపోతే కానీ ప్రభుత్వం స్పందిందా అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details