ధూప, దీప, నైవేద్య పథకం మొత్తాన్ని పెంచిన ప్రభుత్వం- బ్రాహ్మణ చైతన్య వేదిక హర్షం - Brahmana Vedika on Govt Help - BRAHMANA VEDIKA ON GOVT HELP
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 8, 2024, 4:39 PM IST
Brahmana Chaitanya Vedika Leaders on Govt Help: దేవాదాయశాఖ పరిధిలో లేని దేవాలయాలకు.. ధూప, దీప, నైవేద్యాల కోసం ఇచ్చే మొత్తాన్ని 5వేల నుంచి 10వేలకు పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై బ్రాహ్మణ చైతన్య వేదిక సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధూప, దీప, నైవేద్య పథకం మొత్తాన్ని పెంచాలని ఎన్నిసార్లు కోరినా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అర్చకులు, దేవాలయాలకు మేలు చేసేలా చంద్రబాబు నిర్ణయం తీసుకోవటంపై కృతజ్ఞతలు తెలిపారు.
" దేవాదాయశాఖ పరిధిలో లేని దేవాలయాలకు ధూప, దీప, నైవేద్యాల కోసం ఇచ్చే మొత్తాన్ని ప్రభుత్వం పదివేల రూపాయలకు పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 6వేల ఆలయాల్లో నిత్యపూజలకు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతాయి. ఇచ్చిన మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు చేపట్టడంపై సంతోషంగా ఉంది." - శ్రీధర్ శర్మ, బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు