ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రజలు ఎక్కువగా ఆశించడం వల్లే వైఎస్సార్సీపీ ఓడిపోయింది: బొత్స - Botsa Satyanarayana key comments - BOTSA SATYANARAYANA KEY COMMENTS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 6, 2024, 7:40 PM IST

Botsa Satyanarayana: ఓటమికి కారణాలు విశ్లేషించుకోకుండా ప్రజలపై నిందలు వేయడంలో వైఎస్సార్సీపీ నాయకులు పోటీ పడుతున్నారు. మొన్నటికి మొన్న జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడినట్లే తాము ఎంతో చేసినా ప్రజలు ఓడించారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ప్రజలు ఎక్కువగా ఆశించడం వల్లే వైఎస్సార్సీపీ ఓడిపోయిందన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఓటమి పాలైన వైఎస్సార్సీపీ అభ్యర్థులతో బొత్స సమావేశం నిర్వహించారు. 

వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి జిల్లాలో వైద్య కళాశాల పెట్టామని పేర్కొన్నారు. కూటమి రెండు కళాశాలలు పెడుతుందేమో అని ప్రజలు ఆశించారేమో అని అన్నారు. విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్ట్​కు గత ప్రభుత్వం రాయి పాతితే తమ ప్రభుత్వంలో శంకుస్థాపన చేశామని తెలిపారు. విజయనగరంలో ఇంకో ఎయిర్ పోర్టు నిర్మాణం చేపడతారేమోనని ఊహించారేమో అన్నారు. విజయనగరం లో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశామని... రెండో విశ్వద్యాలయం తీసుకొస్తారని ప్రజలు అనుకున్నారేమో అని ప్రజలపై ఛలోక్తులు విసిరారు. తారకరామ తీర్థ సాగర్ పనులు జరుగుతున్నాయని, కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ను పూర్తి చేయాలన్నారు. తమ ప్రభుత్వం తప్పు చేసిందని అనుకుంటే ఆ తప్పును రాబోయే ప్రభుత్వం సరిదిద్దాలని కోరారు. ప్రజలు ఆశించిన స్థాయిలో తమ ప్రభుత్వం చేయలేదనే తాము ఓటమి పాలయ్యామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details