ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

చంద్రబాబు నాయకత్వంలో త్వరలోనే వికసిత ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణం: సత్యకుమార్ - BJP Minister Satyakumar Interview - BJP MINISTER SATYAKUMAR INTERVIEW

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 12, 2024, 12:47 PM IST

BJP Minister Satyakumar Interview: కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో త్వరలోనే వికసిత ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణం జరుగుతుందని బీజేపీ నేత సత్యకుమార్‌ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం సాకారమవుతుందని తెలిపారు. రాష్ట్రంలో పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్న ఆయన రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత వైఎస్సార్సీపీ పాలనలో ఐదేళ్లు అభివృద్ధి కనిపించకుండా పోయిందన్నారు. త్వరలోనే అద్భుతంగా అమరావతి నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముందు విజయవాడలో మాట్లాడిన సత్యకుమార్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమాలు చేపడతామంటున్న సత్యకుమార్‌తో మా ప్రతినిధి ముఖాముఖి.

"సామాన్య కార్యకర్తను గుర్తించిన అధినాయకత్వానికి ధన్యవాదాలు. త్వరలోనే వికసిత ఆంధ్రప్రదేశ్‌ నిర్మాణం జరుగుతుంది. ఏపీ జీవనాడి పోలవరం కల సాకారం అవుతుంది. రాష్ట్రంలో పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. వైఎస్సార్సీపీ పాలనలో ఐదేళ్లు రాష్ట్రం కునారిల్లింది. ఐదేళ్లు అభివృద్ధి కనిపించకుండా పోయింది. త్వరలోనే అద్భుతంగా అమరావతి నిర్మాణం జరుగుతుంది. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమాలు చేపడతాం. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక ప్రగతిలో పరుగులు పెడుతుంది." - సత్యకుమార్‌

ABOUT THE AUTHOR

...view details