ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ధర్మానికి అధర్మానికి మధ్య జరిగేవే 2024 ఎన్నికలు- బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి - BJP candit Adinarayana Reddy - BJP CANDIT ADINARAYANA REDDY

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 6, 2024, 5:33 PM IST

BJP candidate Aadinarayana Reddy about ysrcp: వైఎస్​ వివేకానంద రెడ్డి హత్య వెనుక జగన్, భారతి పాత్ర ఉందని జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. కడప ఎంపీ టికెట్‌ను అవినాష్‌కు ఇవ్వకపోతే అవినాశ్​ రెడ్డి అప్రూవర్‌గా మారి జగన్ బండారాన్ని బయటపెడతారనే అనుమానంతో హంతకుడ్ని కాపాడుతున్నారని ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. 

Alliance Meeting about 2024 Elections at Kadapa: జగన్ లాంటి దుర్మార్గులు రాష్ట్రానికి అవసరమా అని ఆదినారాయణ రెడ్డి ప్రశ్నించారు. జగన్ లాంటి వ్యక్తిని రాష్ట్రం నుంచి సాగనంపాలంటే ఎన్డీఏ కూటమిని (Allinace) అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ధర్మానికి అధర్మానికి మధ్య 2024 ఎన్నికలు జరుగబోతున్నాయని ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు. కడపలోని కూటమి నేతలు నియోజకవర్గ ఇన్చార్జిలతో సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వైఎస్సార్సీపీ సర్కార్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే వాటిపై చర్చించారు.

ABOUT THE AUTHOR

...view details