LIVE: కుప్పంలో చంద్రబాబు తరపున భువనేశ్వరి నామినేషన్ - BHUVANESWARI BABU NOMINATION - BHUVANESWARI BABU NOMINATION
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 19, 2024, 12:50 PM IST
|Updated : Apr 19, 2024, 1:43 PM IST
LIVE: టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలను ఉంచి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం లక్ష్మీపురంలోని మసీదు ఆవరణలో ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత బాబూ నగర్‌లోని చర్చిలో ప్రార్థనలు చేశారు. మరోవైపు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలు తరలివచ్చారు. కుప్పం చెరువు కట్ట మీదుగా టీడీపీ ర్యాలీ కొనసాగుతోంది. ర్యాలీ అనంతరం చంద్రబాబు తరపున భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు.కుప్పం శాసన సభ స్థానానికి చంద్రబాబు 8వ సారి పోటీ చేస్తున్నారు. ఈ దఫా లక్ష ఓట్ల ఆధిక్యం అధించేందుకు టీడీపీ నేతలు అడుగులు వేస్తున్నామన్నారు. కుప్పం అభివృద్ధికి 20 అంశాలతో మేనిఫెస్టోను రూపొందించినట్లు వివరించారు. సాయంత్రం 5 గంటలకు టీడీపీ కార్యాలయంలో ప్రముఖులతో భువనేశ్వరి ముఖాముఖి, 20న అధినేత పుట్టిన రోజు సందర్భంగా కదిరిబండ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారన్నారు. టీడీపీ కార్యాలయంలో ముస్లిం మహిళలతో ముఖాముఖిలో పాల్గొంటారన్నారు.
Last Updated : Apr 19, 2024, 1:43 PM IST