భద్రాద్రి రామయ్య హుండీ లెక్కింపు - 40 రోజుల్లో రూ.1.21 కోట్ల ఆదాయం - Bhadradri Hundi Counting - BHADRADRI HUNDI COUNTING
Published : Jul 22, 2024, 4:11 PM IST
|Updated : Jul 22, 2024, 7:28 PM IST
Bhadradri Hundi Counting : భద్రాద్రి రామయ్య సన్నిధిలో గత 40 రోజులుగా భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలను లెక్కించారు. సుమారు 300 మంది భక్తులు తిరుపతి, విజయవాడ, పాల్వంచ, కరీంనగర్ నుంచి వచ్చారని చెప్పారు. స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు భద్రాచలం వచ్చి ఆలయ హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. ఆలయ అధికారులు లెక్కింపునకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు.
ప్రధాన ఆలయంలోని హుండీలతో పాటు ఉపాలయాలలోని హుండీలను చిత్రకూట మండపం వద్దకు తీసుకెళ్లి లెక్కించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎల్.రమాదేవి ఆధ్వర్యంలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో పోలీస్ బందోబస్తు నడుమ హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. రూ.1 కోటి 21 లక్షల 44 వేల 579 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు ఇప్పటి వరకు ఆలయ చుట్టు పక్కల వరద నీరు రాలేదని, ఒకవేళ వరద నీరు వస్తే హెచ్చరికల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.