ఎన్నికల్లో ఎన్డీఏకే తమ మద్దతు-బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు - BC Welfare Support To NDA - BC WELFARE SUPPORT TO NDA
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 14, 2024, 8:19 PM IST
BC Welfare Association Support To NDA In Elections Meeting In Kadapa : రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు ప్రకటించారు. గుంటూరులో రాష్ట్ర స్థాయి బీసీ సంక్షేమ సంఘం భవిష్యత్తు కార్యచరణ సమావేశం (Meeting) నిర్వహించారు. ఈ సమావేశానికి బీసీ సంఘం ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరయ్యి కూటమికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. జగన్ సర్కారు వచ్చి ఐదేళ్లైన బీసీలకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని శంకరరావు ఆరోపించారు.
ఎన్నికల అనంతరం బీసీ సంక్షేమ సంఘం (BC Welfare Association) బీసీ అభివృద్ధికి సంబంధించిన కార్యచరణతో ముందుకు సాగుతుందన్నారు. జగన్ ప్రభుత్వం 56 బీసీ కార్పొరేషన్‌లను ఏర్పాటు చేశారు కానీ నిధులు మాత్రం రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. బీసీ ఆర్థిక సంస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో ఎన్డీయే కూటమితో జతకట్టనున్నామన్నారు.