తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలయ్య కుమార్తె - తిరుపతిలో బాలయ్య కుమార్తె
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 22, 2024, 1:40 PM IST
Balakrishna Daughter Tejaswini in Tirumala: సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని దంపతులు తిరుమల (Tirupathi) శ్రీవారిని దర్శించుకున్నారు. ఈరోజు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తేజస్వి భర్త భరత్, కుమారునితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు తేజస్వి దంపతులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తేజస్విని గర్భాలయంలో వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించి, మెుక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు తేజస్వి దంపతులకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు.
మంగళవారం శ్రీవారిని 62,304 మంది దర్శించుకోగా రూ.3.61 కోట్ల హుండీ కానుకలు లభించాయని ఆలయ అధికారులు తెలిపారు. ఈనెల 24న పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం గరుడసేవ జరగనుంది. రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు.