ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మూడు రాజధానులు కడతామని ప్రజలను మోసం చేశారు: బహుజన పరిరక్షణ సమితి అధ్యక్షుడు గురునాథం - YSRCP Government Looted Money - YSRCP GOVERNMENT LOOTED MONEY

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 23, 2024, 7:05 PM IST

Bahujan Parirakshana Samithi President Gurunadham Fires On Ysrcp Gov: జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, కొడాలి నాని, నందిగం సురేష్​ అమరావతిని అడ్డం పెట్టుకుని సర్వం దోచేశారని బహుజన పరిరక్షణ సమితి అధ్యక్షుడు, 3 రాజధానుల శిబిరం మాజీ నిర్వాహకుడు మాదిగాని గురునాథం మండిపడ్డారు. 3రాజధానులు పేరు చెప్పి ప్రవాసాంధ్రుల నుంచి 400 కోట్లు వసూలు చేసి వారే దోచేశారని ఆరోపించారు. 

Gurunadham Allegations on YSRCP Government Looted Money: 3రాజధానులు ఉద్యమం తానే (గురునాథం) చేయిస్తున్నట్లు సజ్జల జగన్​ను నమ్మించి ఇసుక ర్యాంప్ నజరానాగా పొందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3రాజధానుల ఉద్యమ నేతలకు ఇళ్ల స్థలాలు, 25లక్షలు, కార్లు ఇస్తామని ట్రాప్ చేసి ఆశ చూపారని విమర్శించారు. 3 రాజధానులు శిబిరానికి వచ్చే ఒక్కొక్కరికీ 500 ఇస్తున్నట్లు దొంగ లెక్కలు రాసి ఆ డబ్బు కూడా నందిగం సురేష్, సజ్జల, కొడాలి నాని కూటమి దోచేసిందని గురునాథం దుయ్యబట్టారు. జగన్ ఓటమే లక్ష్యంగా బహుజనులంతా పని చేస్తామని గురనాథం స్పష్టం చేశారు. ఎన్నికల తరువాత అధికారంలోకి రాబోయేది కూటమి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details