ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వాహన తనిఖీల్లో 13 ఎర్రచందనం దుంగలు స్వాధీనం - ఇద్దరు నిందితులు పరార్​ - Red Sandalwood Logs Seized - RED SANDALWOOD LOGS SEIZED

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 14, 2024, 4:48 PM IST

Authorities Seized Red Sandalwood Logs During Vehicle Inspection: అక్రమంగా తరలిస్తున్న 13 ఎర్రచందనం దుంగలను శ్రీసత్యసాయి జిల్లా కదిరి అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నల్ల చెరువు మండలం పెద్ద ఎల్లంపల్లి వద్ద జాతీయ రహదారిపై అటవీ శాఖ అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు. కర్ణాటక రిజిస్ట్రేషన్​తో ఉన్న కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అధికారులు వాహనాలను తనిఖీ చేయటం చూసి ఆగకుండా వేగంగా ముందుకు వెళ్లిపోయారు. దీంతో అటవీ శాఖ సిబ్బంది ఆ వాహనాన్ని వెంబడించడంతో కారును అక్కడ వదిలేసి అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు నిందితులు పరారయ్యారని పోలీసులు తెలిపారు. 

నిందితులు వదిలేసిన కారును పోలీసులు తనిఖీ చేయగా అందులో 13 ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. వాటిని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కారుతోపాటు దుంగలను సైతం అక్కడి నుంచి కదిరికి తరలించారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి నిందితులను పట్టుకుంటామని అటవీ శాఖ అధికారి గుర్రప్ప తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details