సహకార సంఘాల్లో జేబు దొంగలు పడ్డారు: అచ్చెన్నాయుడు - revival of cooperative societies
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 26, 2024, 4:51 PM IST
Atchannaidu on Revamping of Cooperative Societies : సహకార వ్యవస్థను సమగ్రంగా ప్రక్షాళన చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. సహకార శాఖ నిర్వహణపై, సామాజిక మాధ్యమం ఎక్స్ వేదిక ద్వారా ఆయన స్పందించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సహకార వ్యవస్థలో జవాబుదారీతనం ఉండాల్సిన చోట జేబు దొంగలు పడ్డారని విమర్శించారు. అవినీతి లెక్కలు తేల్చి, తిన్నదంతా కక్కిస్తామన్నారు. అవినీతికి పాల్పడిన సహకార సంఘాలు, డీసీసీబీల్లో (DCCB)ల్లో సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నూతన సంస్కరణలు తెచ్చి సహకార వ్యవస్థను బలోపేతం చేస్తామని మంత్రి వెల్లడించారు.
వైఎస్సార్సీపీ హయాంలో రైతు సంఘాల పేరుతో వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీలో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని, వాటిపై విచారణ జరపాలని అధికారులను వ్యవసాయ శాఖమంత్రి అచ్చెన్నాయుడు (Agriculture Minister Kinjarapu Atchannaidu) ఆదేశించారు. గత ఐదేళ్లలో రైతులకు వ్యక్తిగతంగా ఒక్క యంత్రాన్నీ అందించలేదని విమర్శించిన విషయం విదితమే.