ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

గిరిజన ఎమ్మెల్యేలతో భేటీకి జగన్ 5 నిమిషాలు కూడా ఇవ్వలేదు: అరకు కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత - Kothapalli Geetha fire on YCP - KOTHAPALLI GEETHA FIRE ON YCP

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 6, 2024, 9:25 PM IST

Aruku BJP MP Candidate Kothapalli Geetha Fires on AP Govt : అరకు పార్లమెంట్ స్దానంలో భారతీయ జనతాపార్టీ మరో సారి పాగా వేయాలని వ్యూహత్మక అడుగులు వేస్తుంది. అందుకోసం బీజేపీ తరఫున కూటమి అభ్యర్ధిగా కొత్తపల్లి గీత ఇక్కడ బరిలో ఉన్నారు. ఈ పార్లమెంటు స్థానంలో గిరిజన, గిరిజనేతరుల సమస్యలు ఎప్పుడూ ప్రజాప్రతినిధులకు సవాళ్లు విసురుతున్నాయి. వాటి పరిష్కార మార్గాలకు హామీలు ఇస్తూనే, మూడు పార్టీలను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రచారంలో కొత్తపల్లి గీత దూసుకుపోతున్నారు. ఎక్కడికి వెళ్లిన గిరిజన, గిరిజనేతర ఓటర్లు ఘన స్వాగతం పలుకుతున్నారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం గిరిజన సమస్యలను గాలికి వదిలేసింది. జగన్ హాయంలో గిరిజన ఎమ్మెల్యేలకి కనీసం 5నిమిషాల సమయం ఇచ్చి మాట్లాడింది లేదని మండిపడ్డారు. ఉన్న ఎమ్మెల్యేలు కూడా అవినీతి, అక్రమాలలో మునిగిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయకులైన గిరిజనులను అడ్డం పెట్టుకుని గంజాయి వ్యాపారం చేశారే తప్ప వారి సమస్యలను పరిష్కరించలేదని తెలిపారు. చివరికి కేంద్రప్రభుత్వం పంచాయితీలకు ఇచ్చిన నిధులను కూడా దోచుకున్నారని మండిపడ్డారు.ఇప్పుడు నేను గిరిజన గ్రామాల్లో పర్యటిస్తుంటే ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వంలో నరకం చూశామని ప్రజలు తెలుపుతున్నారని కొత్తపల్లి గీత వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details