ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వైసీపీ ఎన్నికల ప్రచారానికి పరాకాష్ట - ఆటోలకు 'సిద్ధం' ఫ్లెక్సీలు - ఆటోలకు సిద్ధం ఫ్లెక్సీలు ఏర్పాటు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 15, 2024, 12:37 PM IST

Arrangement in Siddham Flexi For Autos: వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ప్రచారం పరాకాష్టకు చేరుకుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా 'సిద్ధం' అని ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆటోలను కూడా వదిలిపెట్టడకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. కడప నియోజకవర్గం పరిధిలో ఉన్న ఆటోలు అన్నింటికీ సిద్ధం ఫ్లెక్సీలను అతికిస్తున్నారు. ఏకంగా విశాఖ నుంచి వలస వచ్చిన వారు ఫ్లెక్సీలను ఆటోలకు కడుతున్నారు. ఫ్లెక్సీలను కట్టినందుకు ఒక్కొక్క డ్రైవర్ నుంచి 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆటో డ్రైవర్ల ఇష్టంతోనే ఫ్లెక్సీలు అతికిస్తున్నామని, అందుకు వారికి అభ్యంతర రసీదును (No Objection Receipt) కూడా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. 

డ్రైవర్లు ఆటోకు కాస్త నీడగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఫ్లెక్సీలను అతికించుకుంటున్నామని తెలిపారు. కొంతమంది ఇదంతా ఎన్నికల ప్రచారం కోసమే చేస్తున్నారని ప్రతిపక్షాలు  మండిపడుతున్నారు. ఆటోలపై ఫ్లెక్సీలను అతికించి ప్రచారం చేసుకోవడం ఏమిటని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దారినపోయే వారందరూ ఆ ఫ్లెక్సీలను చూసి నవ్వుకుంటున్నారు. వైసీపీ ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరుకుందంటూ స్థానికులు విమర్శిస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details