ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

చలో విజయవాడ అనుమతి కోసం మరోసారి సీపీని కలుస్తాం-ఏపీ సీపీఎస్ - ఏపీ సీపీఎస్ ఉద్యోగ సంఘాలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 17, 2024, 7:56 PM IST

APCPSEA association leader Mariadas: ఓట్ ఫర్ ఓపీఎస్ పేరుతో రేపు చేపట్టిన చలో విజయవాడకు ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదో ఆర్ధం కావడం లేదని ఏపీ సీపీఎస్ ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.మరియాదాస్ ఆసహనం వ్యక్తం చేశారు. తాము ఏమన్నా సంఘ విద్రోహ శక్తులమా? టెర్రరిస్టులమా? అని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలియ చేస్తామన్నా పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. ప్రజాస్వామ్యంలో బాధను చెప్పే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల్లో హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు జీపీఎస్​ను అమలు చేస్తామని అంటున్నారని మండిపడ్డారు. తమకు ఈ జీపీఎస్ విధానం వద్దని గత నాలుగేళ్లుగా ప్రభుత్వానికి చెబుతూనే ఉన్నామని తెలిపారు. రేపటి చలో విజయవాడ కార్యక్రమంపై మరోసారి విజయవాడ పోలీస్ కమిషనర్ ని కలుస్తామని మరియాదాస్ వెల్లడించారు. సీపీ నుంచి వచ్చే సమాధానంతో తమ భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ఉంటుందని మరియాదాస్ పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details