ఖరీఫ్ ప్రారంభమైనా ప్రభుత్వం ప్రణాళికలు కరువు- ఏపీ కౌలు రైతు సంఘం - Tenant Farmers Demand - TENANT FARMERS DEMAND
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 2, 2024, 4:36 PM IST
Tenant Farmers Demand ID Cards: ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ప్రభుత్వం ప్రణాళికలు దానికి తగ్గట్లు లేవని ఏపీ కౌలు రైతుల సంఘం నాయకులు విమర్శించారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డుల మంజూరు చేయడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుందన్నారు. గ్రామ సభలు నిర్వహించి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విత్తనాలు సరఫరాలోనూ కౌలు రైతులకు సబ్సిడీ ఇవ్వాలన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడంతో వారికి పంట నష్టపరిహారం, ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలు అందడం లేదని విమర్శించారు. రైతులకు ఇవ్వాల్సిన నష్ట పరిహారం వారికి అందించాలని డిమాండ్ చేశారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు పోయినా ప్రభుత్వం సరి చేయలేదని విమర్శించారు. భవిష్యత్తులో నీరు వస్తే వాటిని పంటలకు ఎలా మళ్లిస్తారని ప్రశ్నించారు. ఇరిగేషన్ అధికారులు స్పందించి వెంటనే మరమ్మత్తు చేయాలని డిమాండ్ చేశారు. పంట కాలువల్లో పెరిగిన తూటికాడను తొలగించి పూడిక తీయాలని కోరారు. వ్యవసాయ పనులు ప్రారంభం అయ్యే లోగా ఈ పనులు పూర్తి చేయాలని ఏపీ కౌలు రైతుల సంఘం ( AP Tenant Farmers ) నాయకులు డిమాండ్ చేశారు.