ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ఏజెండాపై ఏపీ మంత్రుల మంతనాలు - AP Ministers on CMs Meeting - AP MINISTERS ON CMS MEETING

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 6, 2024, 3:37 PM IST

AP Ministers on CMs Meeting: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో చర్చించాల్సిన అంశాలపై ఏపీ మంత్రులు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. సాయంత్రం ఆరు గంటలకు తెలంగాణా సీఎం రేవంత్‌ రెడ్డి, చంద్రబాబు ప్రజాభవన్‌లో భేటీ కానున్నారు. విభజన అంశాలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. షీలా బీడే కమిటీ సిఫారసులు, విద్యుత్ బకాయిలు, ఏపీఎఫ్​సీ అంశాలు, ఉమ్మడి సంస్థల ఖర్చుల చెల్లింపులపై చర్చించనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య పదేళ్లుగా పూర్తికాని సంస్థల విభజనపై సమీక్షించనున్నారు. తెలంగాణ నుంచి ఏపీకి రావలసిన విద్యుత్ బకాయిలపై సైతం చర్చ జరగనుంది. 

కాగా ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలపై ఏపీ-తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చకు వచ్చే అజెండా ఖరారు అయ్యింది. మొత్తం 10 అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చేలా అజెండాను సిద్దం చేశారు. ఈ సమావేెశానికి ఏపీ నుంచి మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, కందుల దుర్గేష్​లు హాజరు కానున్నారు. వీరితో పాటు అధికారుల బృందంలో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఆర్దిక శాఖ సహా కీలక విభాగాల కార్యదర్శులు కూడా హాజరు కానున్నారు.

ABOUT THE AUTHOR

...view details