ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - CEO MUKESH KUMAR MEENA - CEO MUKESH KUMAR MEENA

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 15, 2024, 1:42 PM IST

Updated : May 15, 2024, 2:13 PM IST

AP CEO Mukesh Kumar Meena Press Meet Live: రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ భారీ స్థాయిలో నమోదైంది. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పలుచోట్లు 2గంటల వరకు పోలింగ్ కొనసాగిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా ఇవాళ మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించనున్నారు. 25 లోక్‌సభ స్థానాలకు 454 మంది, 175 శాసనసభ నియోజకవర్గాలకు 2వేల 387 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని పేర్కొన్నారు. 4 కోట్ల 14 లక్షల 18 వందల 87 మంది ఓటర్లు ఉన్నారని, ఓటు హక్కు వినియోగించుకునేందుకు, 46వేల 389 కేంద్రాల్ని, ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిందని, లక్షా 60 వేల ఈవీఎం (EVM)లు వినియోగించినట్లు పేర్కొన్నారు. పలు చోట్లు హింసాత్మక ఘటనలు నెలకొన్నాయని, వాటినిపై చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఆయా నియోజకవర్గాల్లో చెదురుమదురు ఘటనలు తప్పా, ఓటింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు. ఎన్నికల్లో పాల్గొన్న సిబ్దందికి కృతజ్ఞతలు తెలిపారు. జూన్ నాలుగో తేదీన ఫలితాలు వెలువడుతాయని సీఈవో మీనా పేర్కొన్నారు. 
Last Updated : May 15, 2024, 2:13 PM IST

ABOUT THE AUTHOR

...view details