ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 25, 2024, 9:59 AM IST

ETV Bharat / videos

బడ్జెట్ ఆమోదం కోసం అసెంబ్లీ సమావేశాలు - జూలై మూడో వారంలో ఉండే అవకాశం - ASSEMBLY SESSION in JULY THIRD WEEK

AP Assembly Sessions Likely Held in July Third Week : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు జూలై మూడో వారంలో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మార్చి నెలాఖరు వరకు అవసరమైన బడ్జెట్ ఆమోదం కోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్‌ కూడా ప్రవేశపెట్టనున్నారు. ఆర్థికశాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సి ఉంది. ఉన్నతస్థాయి అధికారులంతా మారిపోయారు. రాష్ట్ర ప్రజల ముందు ఏపీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని సుస్పష్టంగా తెలియజేయాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉంది. 

త్వరలో అసెంబ్లీ సమావేశాల తేదీ కూడా ఖరారయ్యే అవకాశం ఉంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు వచ్చే నెలఖారుతో ముగియనుంది. దీంతో జులైలో ఒక వారం రోజుల పాటు రాష్ట్ర ఉభయ సభల సమావేశాలు ఏర్పాటు చేసి పూర్తిస్థాయి బడ్జెట్‌కు ఆమోదం తీసుకోవాలనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ల్యాండ్ టైటిల్ యాక్టు రిపీల్ బిల్లు సహా వివిధ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details