LIVE: పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేస్తున్న విద్యాశాఖ కమిషనర్ - ప్రత్యక్ష ప్రసారం - ap SSC results 2024 - AP SSC RESULTS 2024
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 22, 2024, 11:04 AM IST
|Updated : Apr 22, 2024, 11:36 AM IST
AP SSC Results 2024: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరై ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్ధిని, విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్‌అప్‌డేట్ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మార్చి 18 నుంచి మార్చి 30 వరకు నిర్వహించిన పదో తరగతి పరీక్ష ఫలితాలను ప్రస్తుతం విడుదల చేస్తున్నారు. రాష్ట్రంలో మార్చి18 నుంచి మార్చి 30 వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు దాదాపు 6 లక్షల 30 వేల 633 మంది విద్యార్థులు హాజరయ్యారు. 3 వేల 473 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థినీ విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షల ప్రక్రియ ముగిసిన వెంటనే అధికారులు మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించి ఈ నెల 8వ తేదీతోనే ముగించారు. మరోసారి జవాబు పత్రాల పరిశీలన, మార్కుల నమోదు, కంప్యూటీకరణ ప్రక్రియను సైతం ఇప్పుటికే పూర్తి చేశారు. ఎస్‌ఎస్‌సీ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో స్టూడెంట్స్ ఫలితాలను చెక్ చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఫలితాలను విడుదల చేస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం.
Last Updated : Apr 22, 2024, 11:36 AM IST