ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కేశినేని శివనాథ్ - AndhraCricket Association Elections - ANDHRACRICKET ASSOCIATION ELECTIONS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 17, 2024, 10:41 PM IST
Andhra Cricket Association Executive Committee Unanimously Elected: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఒకటే ప్యానల్ నామినేషన్ వేయడం నామినేషన్ గడువు పూర్తి కావడంతో ఇక అధికారికంగా ఈ ప్యానల్ ఎన్నిక ప్రకటించడమే తరువాయిగా ఉంది. ఏసీఏ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్, ఉపాధ్యక్షుడిగా వెంకట ప్రశాంత్ వ్యవహరించనున్నారు. ఏసీఏ కార్యదర్శిగా సానా సతీష్, జాయింట్ సెక్రటరీగా ఎమ్మెల్యే విష్ణు కుమార్‌రాజు ఉండనున్నారు. ఏసీఏ కోశాధికారిగా శ్రీనివాస్, కౌన్సిలర్‌గా గౌరు విష్ణుతేజ్ వ్యవహరించున్నారు. తుది ఫలితాలను వచ్చేనెల 8న అధికారిక ప్రకటించనున్నారు. నామినేషన్ గడువు పూర్తయ్యే నాటికి ఒక్క ప్యానలే నామినేషన్లు దాఖలు చేసింది. అధికారికంగా ఎన్నికల ఫలితాలను సెప్టెంబర్ 8 నా ప్రకటిస్తారు. శరత్ చంద్రారెడ్డి నేతృత్వంలోని గోపీనాథ్ రెడ్డి కార్యదర్శిగా ఉన్న ఏసీఏ కార్యవర్గం ఈ నెల 4న రాజీనామా సమర్పించింది. తరువాతనే కొత్త కార్యవర్గం ఎన్నికకు నోటిఫికేషన్ రావడం ఒక్క ప్యానల్ నామినేషన్ వేయడం చోటు చేసుకున్నాయి.