ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఆలస్యంగా వచ్చిన అంబులెన్స్​- గాయాలతో విలవిల్లాడిన బాధితురాలు - Ambulance Delay Injury Woman Shaken

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 12, 2024, 9:42 AM IST

Ambulance Delay That Injured Woman Was Shaken: విశాఖలో ప్రమాదం జరిగిన చాలా సమయం వరకు 108 వాహనం రాకపోవడంతో బాధితురాలు నరకయాతన అనుభవించారు. ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి తరలించాల్సిన ప్రభుత్వ అంబులెన్స్‌ల నిర్వహణ అధ్వానంగా తయారైంది. విశాఖపట్నం నగర శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖ జిల్లా  పాత గాజువాకకు చెందిన గణేష్‌, భవానీ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి స్కూటీపై అనకాపల్లి జిల్లా గోవాడ నుంచి ఇంటికి బయలుదేరారు. 

విశాఖ శివారులోని మూడు మదాలు కూడలి వద్ద స్కూటీ అదుపు తప్పి కింద పడిపోయారు. మహిళ తలకు తీవ్ర గాయాలు కాగా మిగిలిన ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి 108కు సమాచారం అందించారు. దాదాపు 40 నిమిషాల పాటు అంబులెన్స్‌ రాకపోవడంతో బాధితురాలు తీవ్ర నొప్పితో విలవిల్లాడారు. దీంతో వాహనదారులు ఇటుక లోడుతో గాజువాక వైపు వెళ్తున్న లారీని ఆపి క్షతగాత్రురాలిని అందులో ఎక్కించి అగనంపూడి ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన గంట తర్వాత ఘటనా స్థలానికి అంబులెన్స్‌ చేరుకుంది. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం బాధితురాలిని ఆలస్యంగా వచ్చిన అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details