'అంబేడ్కర్ విదేశీ విద్య పథకం నా కెంతో ఉపయాగపడింది- ఆ పార్టీకి ఓటేసి రుణం తీర్చుకుంటా' - TDP Videshi Vidya Scheme - TDP VIDESHI VIDYA SCHEME
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 4, 2024, 4:47 PM IST
Ambedkar Videshi Vidya Scheme at TDP Government : తెలుగుదేశం హయాంలో అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకం ద్వారా ఎందరో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పేద విద్యార్థులు విదేశీ విద్యాసంస్థల్లో ఉన్నత చదువులు చదువుకున్నారు. చంద్రబాబు హయాంలో ఈ పథకం ద్వారా అమెరికా వెళ్లిన గుంటూరుకు చెందిన ఫర్హీన్ అనే యువతి ఇప్పుడు కృతజ్ఞతలు చెప్పేందుకు సొంతూరుకు వచ్చింది. మీడియాతో ఆమె మాట్లాడుతూ, ఉన్నత చదువులు చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాలని చిన్నప్పటి నుంచి ఆశయం ఉండేది. ఇదే విషయం మా నాన్నతో చెప్పాను దానికి అయ్యే ఖర్చును చూసి నాన్న బయపడ్డారు.
అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు విదేశీ విద్యాసంస్థల్లో చదువుకునే పేదవిద్యార్థులకు స్కాలర్ షిప్లు ఇస్తున్నారని తెలుకోని అప్లై చేశాను. దానిలో అర్హత సాధించి విదేశాలకు వెళ్లి విద్యాభ్యాసం కొనసాగించాను. డబ్బులు ఎప్పటికప్పుడు సమయానికి బ్యాంక్ అకౌంట్లో జమఅయ్యేవి. దీనివల్ల ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చదువును పూర్తి చేసుకున్నా. ఇప్పుడు విదేశాలలో ఉంటూ మంచి ఉద్యోగం చేస్తున్న. నా ఆశయం నెరవేరడానికి చంద్రబాబు నాయుడు అమలు చేసిన అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకమే కారణం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓటేసి రుణం తీర్చుకుంటానని ఫర్హీన్ స్పష్టం చేసింది.