ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రోడ్డెక్కిన రాజధాని రైతులు - వార్షిక కౌలు చెల్లించాలంటూ ఆందోళన - Amaravati Farmers Protest

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 15, 2024, 4:38 PM IST

Amaravati Farmers Protest on Lease Payment Issue: వార్షిక కౌలు చెల్లించాలంటూ తుళ్లూరులో రాజధాని రైతులు కదం తొక్కారు. అమరావతి ఉద్యమం ప్రారంభించి 15 వందల 50 రోజులు పూర్తయిన సందర్భంగా తుళ్లూరు దీక్షా శిబిరం నుంచి సీఆర్​డీఏ (CRDA) కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం ఎదుట నిరసన తెలిపి అధికారులకు వినతిపత్రం అందజేశారు. గత రెండేళ్ల నుంచి కౌలు ఇవ్వకుండా ప్రభుత్వం నానా ఇబ్బందులు పెడుతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిక్షణం అమరావతి విచ్ఛిన్నంపైనే దృష్టి సారించారని మండిపడ్డారు. దీంతోపాటు భూసేకరణ రద్దు జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీవో వెనెక్కి తీసుకోపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని అమరావతి రైతులు హెచ్చరించారు. 

"సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతి రైతులను ఏదో ఒక విధంగా ఇబ్బంది పెడుతున్నారు. ఆయన సీఎం అయినప్పటి నుంచి కోర్టుల చుట్టూ తిరిగితే గానీ వార్షిక కౌలు చెల్లించే పరిస్థితి లేదు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా భూములు ఇచ్చినందుకు మమ్మల్ని ఈ రకంగా వేధిస్తున్నారు." - అమరావతి రైతుల ఆవేదన

ABOUT THE AUTHOR

...view details