నెరవేరిన ఆకాంక్ష- తిరుమలకు అమరావతి రైతుల కృతజ్ఞత పాదయాత్ర - Amaravati Farmers Padayatra - AMARAVATI FARMERS PADAYATRA
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 24, 2024, 12:59 PM IST
Amaravati Farmers Padayatra: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏర్పాటు, అమరావతి ఉద్యమ ఆకాంక్ష నెరవేరటంతో రైతులు కృతజ్ఞత పాదయాత్ర చేపట్టారు. వెంకటపాలెంలోని శ్రీ వేంకటేశ్వర ఆలయం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు మహిళలు, రైతులు కృతజ్ఞత పాదయాత్ర చేపట్టారు. ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పాదయాత్రను ప్రారంభించారు. స్వామివారికి మొక్కు చెల్లించుకోవటంతో పాటు గతంలో తాము పాదయాత్ర చేసిన సమయంలో మద్దతిచ్చిన వారికి కృతజ్ఞతలు చెబుతామని రైతులు అంటున్నారు. కూటమి అధికారంలోకి రాగానే అమరావతి పనులు ప్రారంభం కావటంపై రైతులు, మహిళలు హర్షం వ్యక్తం చేశారు.
"రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే చంద్రబాబు సీఎం కావాలని తిరుమల వేంకటేశ్వరుడికి మొక్కుకున్నాం. మా ఆకాంక్ష నెరవేరింది. ఎన్టీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రజల జీవితాల్లో అలముకున్న కారుచీకట్లు తొలిగిపోయాయి. ఈ నేపథ్యంలో మేము తిరుమలకు పాదయాత్రగా బయల్దేరాం. ఇది సంకల్ప యాత్రకాదు, విజయోత్సవ ర్యాలీ." - అమరావతి రైతులు