ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఎన్నికల వేళ వైఎస్సార్​సీపీకి షాక్​ - పార్టీకి రాజీనామా చేసిన అమరావతి ఎంపీపీ - Mekala Hanumantha Rao Yadav - MEKALA HANUMANTHA RAO YADAV

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 3, 2024, 10:48 AM IST

Amaravathi Mandal Parishad President(MPP) Mekala Hanumantha Rao Yadav Resign YSRCP : సార్వత్రిక ఎన్నికలు మరో పదిరోజులు ఉండగా పల్నాడు జిల్లాలో వైఎస్సార్సీపీకి భారీ షాక్​ తగిలింది. అమరావతి ఎంపీపీ మేకల హనుమంతరావు యాదవ్​ వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. నా ఎస్సీ, నా బీసీలంటూ గుండెలు బాదుకునే సీఎం జగన్‌ రాజకీయంగా వారిని అణిచివేశారని ఎంపీపీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ నేత మేకల హనుమంతరావు యాదవ్‌ విమర్శించారు.

రాజకీయంగా బీసీలను అణగదొక్కుతున్న వైసీపీ ఎమ్మెల్యేలపై జగన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మేకల హనుమంతరావు పేర్కొన్నారు. పుష్కర కాలంగా పార్టీకోసం పనిచేసినా, పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కనీసం తనను పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదని మండిపడ్డారు. ఒక మండలానికి ప్రజాప్రతినిధి అయిన తనకు కనీసం నామినేషన్ కార్యక్రమానికి ఆహ్వానం అందలేదన్నారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు వైఖరితో విసుగు చెంది పార్టీని విడుతున్నట్లు వెల్లడించారు. అధికార పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పిన ఆయన పల్నాడు జిల్లాలో యాదవుల దమ్ము ఏంటో వైఎస్సార్సీపీకి చూపిస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details