ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

భూ వివాదంపై పోలీసులు పట్టించుకోవటం లేదు - కలెక్టర్​కు గ్రామస్థుల ఫిర్యాదు - villagers Complained to Collector

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 6, 2024, 3:57 PM IST

Alluri District Villagers Complained to Collector about Destruction of Village on Friday: అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం ఎర్రబయలులో జరిగిన విధ్వంస ఘటనపై బాధితులు కలెక్టర్ సుమిత్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఆ భూములు తమవేనని భూమికి సంబంధించిన పత్రాలు కూడా ఉన్నాయని కలెక్టర్​కు వివరించారు. భూ తగాదా అంశంపై హైకోర్టులో స్టే ఉన్నా చుట్టుపక్కల గ్రామస్థులు తమపై దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 22 మందిపై కేసులు పెడతామని చెప్పి పోలీసులు చేతులు దులుపుకున్నారని, ఇప్పటికి ఒక్కర్ని కూడా అరెస్టు చేయలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ప్రాణహాని ఉందని న్యాయం చేయాలని కలెక్టర్‌కు విన్నవించుకున్నారు.

ఇదీ జరిగింది: ఎర్రబయలు గ్రామస్థులు, గ్రామం పక్కనే ఉన్న భూమిని సాగు చేసుకుంటున్నారు. ఎర్రబయలు గ్రామస్థులు పంటలు పండిస్తుంటే మిగిలిన గ్రామాల ప్రజలు వచ్చి పంటలను ధ్వంసం చేయటం కొన్ని సంవత్సరాల తరబడి వివాదం నడుస్తూనే ఉంది. అయితే ఆ భూమిలో జి మాడుగుల మండలానికి కొందరు  నిర్మాణాలు చేపట్టారు. నిర్మాణాలను గమనించిన ఎర్రబయలు గ్రామస్థులు స్పందనలో పోలీసులకు పిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు ఎర్రబయలు పక్కనున్న భూమి వద్దకు చేరుకున్నారు. ఇదే సమయంలో సమీపంలో కోడి పందాలు నిర్వహిస్తున్న సమాచారం పోలీసులకు తెలిసింది. కోడిపందేలను ఆపి తిరిగిరావాలనుకుని పోలీసులు అక్కడి నుంచి వెళ్లారు. పోలీసులు అక్కడ నుంచి కదిలిన విషయం తెలుసుకున్న మరో వర్గమైన గ్రామస్థులు, ఎర్రబయలు గ్రామంపై దాడికి దిగారు. కర్రలు, రాళ్లు ఇలా చేతికి ఏది దొరికితే అది పట్టుకుని దాడికి తెగబడ్డారు. గ్రామంలోని ఇళ్లను ధ్వంసం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details