వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మోసం చేసింది: అగ్రిగోల్డ్ బాధితులు - Agrigold victims meet Nara Lokesh
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 17, 2024, 10:07 AM IST
AgriGold Victims Meet With TDP Leader Nara Lokesh: అగ్రిగోల్డ్ బాధితులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ను కలిశారు. అగ్రిగోల్డ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో లోకేశ్‌ను కలసి తమ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 10 లక్షల మందికి 3వేల 80 కోట్ల రూపాయలు చెల్లించవలసి ఉందని గుర్తు చేశారు. మృతి చెందిన అగ్రిగోల్డ్ బాధితులకు 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం తమను మోసం చేసిందన్నారు.
అగ్రిగోల్డ్ బాధితుల విషయంపై కార్యాచరణను చేపడతామని లోకేశ్ అన్నారు. ఈ అంశంపై మరింత లోతుగా అధ్యయనం చేసి మరోసారి బాధితులతో మాట్లాడతానని లోకేశ్ అన్నారు. ఏ ఒక్కరూ అధైర్యపడకుండా, ఆత్మహత్యలు, అసహజ మరణాలకు గురికావద్ధని ఆయన విజ్ఞప్తి చేశారు. బాధితులకు సంబంధించిన పలు వివరాలను లోకేశ్ అడిగి తెలుసుకున్నారు. రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో అగ్రిగోల్డ్ బాధితులందరికీ పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు.