పరిశుభ్రత పాటించాలి - 'విశాఖ ఆర్కే బీచ్ క్లీనింగ్'లో సినీ నటి లావణ్య త్రిపాఠి
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 28, 2024, 5:18 PM IST
Actress Lavanya Tripati in Visakha Beach Cleaning Program: విశాఖ ఆర్కే బీచ్‌లో సినీ నటి లావణ్య త్రిపాఠి సందడి చేశారు. జాతీయ పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా ఉదయం నిర్వహించిన బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అందమైన విశాఖ నగరాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచాలని లావణ్య త్రిపాఠి పిలుపునిచ్చారు.
తనతో పాటు వైజాగ్ వాలంటీర్స్ విస్తృతంగా బీచ్‌ను పరిశుభ్రం చేశారు. ఫిబ్రవరి 2న రిలీజ్ కాబోతున్న 'మిస్ ఫర్ఫెక్ట్' వెబ్ సిరీస్‌తో పరిశుభ్రత పట్ల అంకితభావం కలిగిన మహిళగా ఆమె కన్పించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తాను నటించిన వెబ్ సిరీస్‌ని ఆదరించాలని నటి లావణ్య త్రిపాఠి కోరారు.
"అందమైన విశాఖ నగరాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచాలి. ఫిబ్రవరి 2న రిలీజ్ కాబోతున్న 'మిస్ ఫర్ఫెక్ట్' వెబ్ సిరీస్‌తో పరిశుభ్రత పట్ల అంకితభావం కలిగిన మహిళగా కన్పించనున్నాను. ప్రతి ఒక్కరూ నేను నటించిన వెబ్ సిరీస్‌ను చూసి ఆదరించాలి." - లావణ్య త్రిపాఠి, సినీ నటి